ఏపీ టెట్ 2025 షెడ్యూల్ విడుదల

by Thanuru Gopichand |

ఏపీ టెట్ 2025 నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది. నిర్వహణకు సంబంధించిన షెడ్యూలును పాఠశాల విద్యా శాఖ విడుదల చేసింది.

ఏపీ టెట్ 2025 షెడ్యూల్ విడుదల
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ టెట్ 2025 నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది. నిర్వహణకు సంబంధించిన షెడ్యూలును పాఠశాల విద్యా శాఖ విడుదల చేసింది. అక్టోబరు 24 నుంచి నవంబరు 23 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. నవంబరు 25న మాక్ టెస్ట్ నిర్వహస్తారు. డిసెంబర్ 10న ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు రెండు సెషన్లలో టెట్ పరీక్షను నిర్వహిస్తారు. జనవరి 2, 2026 నుంచి 9వ తేదీ వరకు కీపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. తుది కీ జనవరి 13న విడుదల చేస్తారు. టెట్ 2025 పరీక్షా ఫలితాలను జనవరి 19న ప్రకటిస్తారు.

కంప్యూటర్‌ బేస్డ్‌ ఆన్‌లైన్‌ పరీక్షల నోటిఫికేషన్, సమాచార బులెటిన్, పరీక్షల షెడ్యూలు, సిలబస్, అభ్యర్థులకు సూచనలు, విధి విధానాల్ని http://tet2dsc.apcfss.in వెబ్‌సైట్‌లో చూడొచ్చని టెట్‌ కన్వీనర్‌ ఎంవీ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఒకవేళ ఎవరికైనా సందేహాలు ఉంటే 8121947387, 8125046997, 7995649286, 7995789286, 9963069286, 6281704160 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు.

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో 2011కు ముందు నియమితులైన ఉపాధ్యాయులకు కూడా ఈ నోటిఫికేషనులో పరీక్ష రాసేందుకు అవకాశాన్ని కల్పించారు. పదవీ విరమణకు ఐదేళ్లకు మించి సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు టెట్‌లో ఉత్తీర్ణులు కావాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న ఉన్న ఉపాధ్యాయులకు టెట్‌ రాసేందుకు వెసులుబాటు కల్పించారు.

Next Story