- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP : టెన్త్ ఫలితాలు విడుదల.. ఈ సారి వారిదే పై చేయి!
ఏపీలో టెన్త్ ఫలితాలు విడదలయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో టెన్త్ ఫలితాలు విడదలయ్యాయి. టెన్త్ ఫలితాలను విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం విడుదల చేశారు. మొత్తం 72.26 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు బొత్స ప్రకటించారు. టెన్త్ ఫలితాల్లో బాలికలు పై చేయి సాధించారు. బాలురు 69.27 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 75.38 శాతం ఉత్తీర్ణత సాధించారు. టెన్త్ ఫలితాల్లో మొదటి స్థానంలో పార్వతీపురం జిల్లా ఉండగా, చివరి స్థానంలో నంద్యాల జిల్లా నిలిచినట్లు బొత్స తెలిపారు. జూన్ 2 నుంచి 10వ తేదీ వరకు అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు ఉంటాయన్నారు. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కు ఈనెల 13 వరకు గడువు ఉందన్నారు. మార్కులు తక్కువ వచ్చినా.. ఫెయిల్ అయినా క్షణికావేశానికి లోను కావద్దని విద్యార్థులకు బొత్స సూచించారు.
Read More: ALERT : మరికాసేపట్లో టెన్త్ ఫలితాలు..
మీ రాష్ట్రాన్ని మీరు చూసుకోండి.. తెలంగాణ మంత్రులపై ఏపీ మంత్రి సీరియస్
- Tags
- ap
- 10th results






