AP Teachers: ఉపాధ్యాయుల ఆందోళనబాట

by Thanuru Gopichand |

ఎస్జీటీలకు మాన్యువల్​కౌన్సెలింగ్​ నిర్వహించాలని డిమాండ్​చేస్తూ ఏపీలో ఉపాధ్యాయులు మెరుపుసమ్మెకు దిగారు.

AP Teachers: ఉపాధ్యాయుల ఆందోళనబాట
X

డీఈవో కార్యాలయాల వద్ద మెరుపుసమ్మె

దిశ, డైనమిక్​ బ్యూరో : ఎస్జీటీలకు మాన్యువల్​కౌన్సెలింగ్​(Counseling) నిర్వహించాలని డిమాండ్​చేస్తూ ఏపీలో ఉపాధ్యాయులు మెరుపుసమ్మెకు (agitation) దిగారు.ఈ రోజు ఏపీలోని అన్ని డీఈవో కార్యాలయాల వద్ద ఆందోళన చేపట్టారు. మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని డీఈవో కార్యాలయం ను ముట్టడించారు. వెబ్ కౌన్సెలింగ్ వద్దు మాన్యువల్ ముద్దు అంటూ నినాదాలు చేశారు. విశాఖ డీఈవో కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఎస్​జీటీ (SGT) ఉపా ధ్యాయులకు మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు నిర్వహిస్తామని పాఠశాల విద్యా కార్యదర్శి సమక్షంలో ఇచ్చిన హామీకి భిన్నంగా వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్ చేయడాన్ని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీంతో వెబ్ ఆప్షన్స్ పెట్టకుండా బాయ్ కాట్ చేయాలని పిలుపునిచ్చింది. ఆదివారం ఉమ్మడి జిల్లాల డీఈవొ కార్యాలయాల ముట్టడికి సిద్ధం అయ్యారు. అయితే ప్రభుత్వ వాదన మరోలా ఉంది.. ఈ ఏడాది ఆన్‌లైన్‌ బదిలీల విధానంలో టీచర్లకు పలు వెసు లుబాట్లు కల్పించామని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. మండల కేంద్రం నుంచి పాఠశాలలకు ఎంత దూరం అనేది ఆన్‌లైన్‌లో ఉంటుందని దీని వల్ల దగ్గర పాఠశాలను ఎంచుకునే అవకాశం లభిస్తుందని స్పష్టం చేస్తోంది. అయితే దీనిని ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారు. వెబ్ కౌన్సిలింగ్ అనేది సెకండరీ గ్రేడ్ టీచర్లకు ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయులు పూర్తిగా నష్టదాయకమ‌ని పేర్కొంటున్నారు.

Next Story