- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, వెబ్ డెస్క్: అమెరికాలో ఏపీకి చెందిన విద్యార్థిని మృతి చెందారు. బాపట్ల జిల్లా కారంచేడుకు చెందిన రాజ్యలక్ష్మి ఉన్నత విద్యకోసం అమెరికా వెళ్లారు. అమెరికాలోని ఓ యూనివర్సిటీలో ఎంఎస్ కంప్యూటర్స్ విభాగంలో విద్యాభ్యాసం పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారు. అయితే మూడు రోజుల క్రితం జలబు ఆలయాసంతో బాధపడ్డారు. దీంతో 9న ఆస్పత్రిలో డాక్టర్ అపాయింట్ మెంట్ తీసుకున్నారు. గురువారం రాత్రి రాజ్యలక్ష్మి ఇంట్లో నిద్ర పోయారు. ఉదయం నిద్రలేవలేదు. దీంతో స్నేహితులు గుర్తించి లేపేందుకు ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందడంతో కారంచేడులోని తల్లిదండ్రులకు ఆమె సోదరుడు ఫోన్ చేసి విషయం తెలిపారు. ఈ మేరకు కారంచేడులో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Next Story






