- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ap: అసెంబ్లీలో అత్యాధునిక భవనం ప్రారంభం..ఖర్చు ఎంతంటే!
అసెంబ్లీ ప్రాంగణంలో అదనపు భవన సముదాయాన్ని మంత్రులు పయ్యావుల కేశవ్, నారాయణ తో కలిసి స్పీకర్ అయ్యన్నపాత్రుడు

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రస్తుతం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వైసిపి సభ్యులు రాకున్నా... తమ వంతు పాత్రగా అసెంబ్లీ సమావేశాలను.. రాజ్యాంగం ప్రకారం నడుపుతోంది కూటమి ప్రభుత్వం. అయితే ఇలాంటి నేపథ్యంలో ఏపీ అసెంబ్లీలో కొత్త భవనాన్ని ప్రారంభించారు. అసెంబ్లీ ప్రాంగణంలో అదనపు భవన సముదాయాన్ని మంత్రులు పయ్యావుల కేశవ్, నారాయణ తో కలిసి స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రారంభించారు. మీడియా పాయింట్ పై అంతస్తులో అదనపు భవన సదుపాయాన్ని ఈ సందర్భంగా ఏర్పాటు చేశారు.
ఈ నిర్మాణంతో 14 వేల చదరపు అడుగుల వర్క్ స్పేస్ ఏపీ సభ్యులకు అందుబాటులోకి వస్తుంది. గత ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి కారణంగా.. ఇలాంటి భవనాలను పట్టించుకోలేదని.. తాము కొత్త నిర్మాణాలపై దృష్టి పెట్టినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక ఈ భవనం నిర్మాణం కోసం ఐదు కోట్లు అంచనా వేశారట. కానీ మూడు కోట్ల రూపాయల లోనే పూర్తి చేసినట్లు ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. అనవసర వస్తువులకు ఖర్చు చేయకుండా తక్కువలో దీని నిర్మించినట్లు తెలిపారు.






