రేపే టెన్త్ రిజల్ట్స్.. పేరెంట్స్, స్టూడెంట్స్‌కు అధికారుల కీలక సూచన

by Naga Rani Yarlagadda |

ఏపీలో టెన్త్ పరీక్షల ఫలితాలను రేపు మంత్రి నారా లోకేష్ విడుదల చేయనున్నారు. ఎక్స్ వేదికగా రిజల్ట్స్ విడుదల చేసి, ఆన్లైన్లో మెమోలు జారీ చేయనున్నారు.

రేపే టెన్త్ రిజల్ట్స్.. పేరెంట్స్, స్టూడెంట్స్‌కు అధికారుల కీలక సూచన
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి (SSC Results 2026) విద్యార్థుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడనుంది. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన పబ్లిక్ పరీక్షల ఫలితాలను రేపు (గురువారం) విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ రేపు ఉదయం తన అధికారిక X వేదికగా ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.

6.30 లక్షల మంది విద్యార్థులు

ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6.30 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగిన ఈ పరీక్షల కోసం ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. పరీక్షలు ముగిసిన వెంటనే సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసిన ప్రభుత్వ పరీక్షల విభాగం, ఫలితాల విడుదలకు అవసరమైన సాంకేతిక ప్రక్రియను కూడా ఇప్పటికే సిద్ధం చేసింది. అధికారిక వెబ్‌సైట్ bse.ap.gov.in ద్వారా మార్కుల మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సాంకేతికతను జోడిస్తూ, ఈసారి మనమిత్ర వాట్సాప్ నంబరు 9552300009 ద్వారా కూడా ఫలితాలను సులభంగా తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. ఫలితాల ప్రకటన అనంతరం విద్యార్థుల మార్కుల జాబితాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు. ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను కూడా రేపే ప్రకటించే అవకాశం ఉంది. ఫలితాల విడుదల నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండాలని విద్యాశాఖ అధికారులు సూచించారు.

Next Story