ఏపీ లిక్కర్ కేసులో ట్విస్ట్.. నిందితుల బెయిల్ పై హైకోర్టుకు సిట్?

by Naga Rani Yarlagadda |

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో (AP Liquor Scam Case) మరో ట్విస్ట్ నెలకొంది. విజయవాడ ఏసీబీ కోర్టు (ACB Court) ముగ్గురు నిందితులైన ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్, బాలాజీ గోవిందప్పలకు

ఏపీ లిక్కర్ కేసులో ట్విస్ట్.. నిందితుల బెయిల్ పై హైకోర్టుకు సిట్?
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో (AP Liquor Scam Case) మరో ట్విస్ట్ నెలకొంది. విజయవాడ ఏసీబీ కోర్టు (ACB Court) ముగ్గురు నిందితులైన ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్, బాలాజీ గోవిందప్పలకు శనివారం బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. వారికి బెయిల్ మంజూరు చేయడంపై సిట్ అధికారులు హైకోర్టును (AP High Court) ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. ముగ్గురి బెయిల్‌పై స్టే విధించాలని కోరుతూ.. హౌస్ మోషన్ పిటిషన్ (House Motion Petition) దాఖలు చేయనున్నట్లు సమాచారం. లిక్కర్ స్కామ్ కేసు నిందితులు బెయిల్ పై విడుదలై బయటే ఉంటే సాక్ష్యుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని, కేసును తప్పుదోవ పట్టించే ఛాన్సులు ఎక్కువగా ఉన్న విషయాన్ని కోర్టుకు వివరించనున్నట్లు తెలుస్తోంది.

కాగా.. ఏసీబీ కోర్టు నుంచి బెయిల్ పొందిన ముగ్గురు నిందితులు.. ఆదివారం ఉదయం విజయవాడ జైలువద్ద 3 గంటల హైడ్రామా తర్వాత విడుదలయ్యారు. బెయిల్ నిన్ననే వచ్చినా విడుదల చేయకపోవడంతో జైలు బయట అడ్వొకేట్లు, లోపల నిందితులు ఆందోళన చేశారు. అధికారులు కావాలనే విడుదలలో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు.

Next Story