AP : దివ్యాంగులకు రెట్రోపిట్టెడ్ త్రీవీలర్ మోటార్ సైకిళ్లు

by Thanuru Gopichand |

రాష్ట్రంలోని దివ్యాంగులకు రెట్రోపిట్టెడ్ త్రీవీలర్ మోటార్ సైకిళ్లను (Motor Cycle) పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

AP : దివ్యాంగులకు రెట్రోపిట్టెడ్ త్రీవీలర్ మోటార్ సైకిళ్లు
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలోని దివ్యాంగులకు రెట్రోపిట్టెడ్ త్రీవీలర్ మోటార్ సైకిళ్లను (Motor Cycle) పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఓ ప్రకటన విడుదల చేశారు. దివ్యాంగుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అన్నారు. అందులో భాగంగా ఉచితంగా రెట్రోపిట్టెడ్ త్రీవీలర్ మోటార్ సైకిళ్లు అందజనేయనున్నట్లు పేర్కొన్నారు. 1750 వాహనాలను కూటమి ప్రభుత్వం ఉచితంగా అందజేయనుందని వెల్లడించారు.

అర్హతలు.. దరఖాస్తు తేదీ

రెగ్యులర్ గ్రాడ్యుయేషన్, ఆపై ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులు, కనీసం పదో తరగతి పాసై స్వయం ఉపాధి పొందేవారు దరఖాస్తు (Application) చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 45 సంవత్సరాల లోపు, అంగవైకల్యం 70 శాతం ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ కూడా తప్పనిసరిగా ఉండాలని మంత్రి వీరాంజనేయ స్వామి తెలిపారు. మరిన్ని వివరాలకు www.apdascac.ap.gov.in వెబ్ సైట్ ని సంప్రదించాలన్నారు. అర్హతలు కలిగినవారు నవంబరు 25 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి కోరారు.

Next Story