AP | మద్యం కేసు నిందితుల రిమాండ్ పొడిగింపు

by Thanuru Gopichand |

మద్యం కేసు (Liquor Scam) నిందితులకు నేటితో రిమాండ్ గడువు ముగిసింది.

AP | మద్యం కేసు నిందితుల రిమాండ్ పొడిగింపు
X

దిశ, వెబ్ డెస్క్ : మద్యం కేసు (Liquor Scam) నిందితులకు నేటితో రిమాండ్ గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు నిందితులను విజయవాడ ఏసీబీ కోర్టు (ACB Court) ముందు హాజరుపరిచారు. వారిని విజయవాడ, గుంటూరు జైళ్ల నుంచి కోర్టుకు తీసుకొచ్చారు. నిందితుల రిమాండ్ పొడిగించాలని మరింత గడువు కోరుతూ పిటిషన్ ను దాఖలు చేశారు. సిట్ అధికారులు వేసిన పిటిషన్ ను విజయవాడ ఏసీబీ కోర్టు విచారించింది. నిందితుల రిమాండ్ ను డిసెంబర్ 19 వరకు పొడిగించింది. దీంతో సిట్ అధికారులు నిందితులను జైళ్లకు తిరిగి తరలించారు. కేసులో నిందితులైన రాజ్ కేసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, బూనేటి చాణక్య, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడు, అనిల్ చోక్రాలను సిట్ అధికారులు జైలుకు తీసుకెళ్లారు. నేటి నుంచి నిందితులు జ్యుడీషియల్ రిమాండులో ఉండనున్నారు.

Next Story