రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు..ఈ జిల్లాలలో పిడుగులు పడే ప్రమాదం

by velandi.Saikiran |

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తారంగా తేలిక పాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది వాతావరణ శాఖ.

రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు..ఈ జిల్లాలలో పిడుగులు పడే ప్రమాదం
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు పడనున్నట్లు అమరావతి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ఎఫెక్ట్ కారణంగా రాబోయే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. అంతేకాదు గంటకు గరిష్టంగా 60 కిలో మీటర్ల నుంచి 70 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ప్రమాదం పొంచి ఉన్నట్లు వార్నింగ్ ఇచ్చింది.

పిడుగులు ప‌డే ప్ర‌మాదం - వాతావ‌ర‌ణ శాఖ‌

ముఖ్యంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా తేలిక పాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది అమరావతి వాతావరణ శాఖ. ఇక శనివారం పార్వతీపురం, విజయనగరం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, బాపట్ల, ప‌ల్నాడు, మార్కాపురం, ప్రకాశం, గుంటూరు, మన్యం, శ్రీకాకుళం, విజయనగరం లాంటి జిల్లాలలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. ఆదివారం కూడా ఏపీలో విస్తారంగా వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. పిడుగులు పడే ప్రమాదమున్న నేపథ్యంలో ఇంట్లోనే ఉండాలని సూచనలు చేసింది.

Next Story