- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ ప్రజలకు అలర్ట్.. 4వ తేదీ నుంచి మళ్లీ వర్షాలే!
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బిగ్ అలర్ట్. ఏపీలో మళ్లీ వర్షాలు మొదలుకానున్నాయి. మొన్నటి వరకు.. ఎడతెరపు లేకుండా వర్షాలు

- ఏపీకి మళ్లీ వర్షాలు
- రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బిగ్ అలర్ట్. ఏపీలో మళ్లీ వర్షాలు మొదలుకానున్నాయి. మొన్నటి వరకు.. ఎడతెరపు లేకుండా వర్షాలు పడ్డ సంగతి తెలిసిందే. దాదాపు వారం రోజులపాటు వరుణుడు బ్రేక్ ఇచ్చాడు. దీంతో ఏపీలో ఎండలు గట్టిగానే కొడుతున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో.. ఏపీలో మళ్లీ వర్షాలు జోరు అందుకుంటాయని వాతావరణ శాఖ సూచనలు చేసింది.
ఆగస్టు 4 అంటే ఎల్లుండి నుంచి... ఏపీలో మళ్లీ వర్షాలు ప్రారంభం కానున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు భారీగా పడతాయని వాతావరణ శాఖ సూచనలు చేసింది. ఎల్లుండి నుంచి మూడు రోజులపాటు వర్షాలు పడే ఛాన్సులు ఉన్నట్లు కూడా చెబుతున్నారు అధికారులు. ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆగస్టు 5వ తేదీ నుంచి వర్షాలు జోరందుకోబోతున్నాయట. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఇది ఇలా ఉంటే శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు భారీగా వస్తోంది. ఈ నేపథ్యంలో గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు అధికారులు.






