- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ap News: కానిస్టేబుల్ అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్స్ వాయిదా
by Vemula.Srinu Prasad |
రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్ వాయిదా పడ్డాయి...

X
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్ వాయిదా పడ్డాయి. మార్చి 14 నుంచి జరగాల్సిన ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌లను వాయిదా వేస్తు్నట్లు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది. అసెంబ్లీ సమావేశాలు, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే కొత్త డేట్స్ ప్రకటిస్తామని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వెల్లడించింది. కాగా కానిస్టేబుల్ పరీక్షలకు సంబంధించి ప్రిలిమినరీ పరీక్షల్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఈనెల 14 నుంచి పీఈటీ, పీఎంటీ ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ ఈవెంట్స్‌లో క్వాలిఫై అయిన అభ్యర్థులు మెయిన్ పరీక్షకు అర్హత సాధిస్తారు. మెయిన్ పరీక్షను ఏప్రిల్ చివరి వారంలో నిర్వహించనున్నారు. అయితే ఈవెంట్స్ వాయిదా పడటంతో మెయిన్ పరీక్షల తేదీ కూడా మారే అవకాశం ఉంది.
Next Story






