సార్ ప్లీజ్.. మీరిద్దరూ కలిసి విమాన ప్రయాణాలు చేయకండి : సీఎం, మంత్రికి అభిమానుల విజ్ఞప్తి

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-01-28 09:21:35  IST  )

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం చెందడంతో ఆయన అభిమానులు తీరని శోకసంద్రంలో మునిగిపోయారు.

సార్ ప్లీజ్.. మీరిద్దరూ కలిసి విమాన ప్రయాణాలు చేయకండి : సీఎం, మంత్రికి అభిమానుల విజ్ఞప్తి
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం చెందడంతో ఆయన అభిమానులు తీరని శోకసంద్రంలో మునిగిపోయారు. బారామతి ప్రభుత్వ ఆస్పత్రి వద్ద కడసారి చూపు కోసం క్యూ కట్టారు. అజిత్ పవార్ మరణం నేపథ్యంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లకు అభిమానులు స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నారు. విమాన ప్రమాదాల్లో రాజకీయ నేతలు మరణిస్తుండటంతో.. దయచేసి మీరిద్దరూ కలిసి విమానాల్లో ప్రయాణించడం మానుకోండి. ఇది మీ సేఫ్టీ కోసమే చెప్తున్నాం. మీకేదైనా జరగరానిది జరిగితే రాష్ట్రాన్ని మేం తట్టుకోలేం. దయచేసి మా అభ్యర్థనను అర్థం చేసుకోండి అంటూ నెట్టింట వీడియోలు పోస్టు చేస్తున్నారు. వాటిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఈ రిక్వెస్ట్ ను ఫాలో అవ్వండని కోరుతుండగా.. మరికొందరు మాత్రం వాళ్లకు ఏమీ కాకూడదని కోరుకోవాలని కానీ.. ఇలాంటి పోస్టులు పెట్టడం ఏంటని మండిపడుతున్నారు.

Next Story