- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపటి నుంచి AP PECET ఎగ్జామ్స్
by Jakkula.Mamatha |
ఆంధ్రప్రదేశ్‌లో బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం రేపటి(సోమవారం) నుంచి ఏపీ పీసెట్ నిర్వహించనున్నారు.

X
దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం రేపటి(సోమవారం) నుంచి ఏపీ పీసెట్ నిర్వహించనున్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పరీక్షలు ఉంటాయని సెట్ కన్వీనర్ ఆచార్య పీపీఎస్ పాల్ కుమార్ తెలిపారు. BPEd కోర్సుకు మూడు సంవత్సరాల డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. 21 సంవత్సరాల వయస్సు పూర్తి అయి ఉండాలి. DPEd కోర్సుకు 12వ తరగతి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత ఉండాలి. ఈ పరీక్షలు పురుష అభ్యర్థులకు ఈ నెల(జూన్) 23 నుంచి 25వ తేదీ వరకు, మహిళలకు 26న పరీక్ష జరుగుతుందని ఆయన వివరించారు. అభ్యర్థులు తమ హల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్ https://cets.apsche.ap.gov.in/ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.
Next Story






