- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP: పవన్ కపటం లేని మంచి మనిషి.. ఎన్నికల వేళ లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు
by Kema Shiva Kumar |
జనసేస అధినేత పవన్ కల్యాణ్ కపటం లేని మంచి మనిషి అంటూ వైసీపీ నాయకులు, ఎన్టీఆర్ సతీమణి లక్షీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: జనసేస అధినేత పవన్ కల్యాణ్ కపటం లేని మంచి మనిషి అంటూ వైసీపీ నాయకులు, ఎన్టీఆర్ సతీమణి లక్షీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ కాకినాడ జిల్లా పిఠాపురంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకు పడ్డారు. అబ్బద్దాలు ఆడటంలో బాబుకు మించిన వారు ఎవరూ లేరని ఆరోపించారు. సొంత మామమే వెన్నుపోటు పొడిచిన ఘటన ఆయనకే దక్కిందన్నారు. పవన్ కల్యాణ్ కపటంలేని మంచి మనిషి అని అలాంటి వ్యక్తి చంద్రబాబును నమ్మి మోసం పోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురంలో కాపులంతా ఐక్యం కావాలని, భారీ మెజారిటీతో వైసీపీ అభ్యర్థి వంగా గీతను అసెంబ్లీకి పంపాలని పిలుపునిచ్చారు. పవన్ పిఠాపురానికి వలస వచ్చాడని.. నిరంతంరం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకురాలు వంగగీతకే ఓటు వేయాలంటూ అభ్యర్థించారు.
Next Story






