ఏపీ పంచాయతీరాజ్‌ శాఖకు 5 జాతీయ పురస్కారాలు.. దేశంలోనే ఫస్ట్

by Naga Rani Yarlagadda |

ఏపీ పంచాయతీరాజ్ శాఖ 5 జాతీయ పురస్కారాలకు ఎంపికైంది. వాటిలో రెండు విభాగాల్లో దేశంలోనే తొలిస్థానంలో నిలిచింది.

ఏపీ పంచాయతీరాజ్‌ శాఖకు 5 జాతీయ పురస్కారాలు.. దేశంలోనే ఫస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పంచాయతీ పురస్కారాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ జాతీయ స్థాయిలో మరోసారి సత్తా చాటింది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ, నానాజీ దేశ్‌ముఖ్‌ సర్వోత్తమ్‌ పంచాయత్‌ సతత్‌ వికాస్‌ పురస్కారాల్లో భాగంగా ఏపీకి మొత్తం 5 జాతీయ అవార్డులు లభించాయి. పంచాయతీరాజ్‌ శాఖలో రెండు విభాగాల్లో ప్రథమ పురస్కారం, ఒక విభాగంలో ద్వితీయ పురస్కారం, మరో రెండు విభాగాల్లో తృతీయ పురస్కారం లభించాయి. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ లో ఏపీ దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. గత ప్రభుత్వ హయాంలో 24వ స్థానంలో ఉన్న ఏపీ.. నేడు దేశంలోనే తొలిస్థానానికి చేరింది. అలాగే జల్ సంచయ్ - జన్ భాగీదారిలో దేశంలోనే ఏపీ ప్రథమస్థానంలో నిలిచింది. గతేడాది కూడా ఏపీ పంచాయతీరాజ్ శాఖ పలు జాతీయ పురస్కారాలు అందుకుంది. ఆ పరంపరను కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా అత్యుత్తమ పనితీరుతో జాతీయ స్థాయిలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.

Next Story