- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP News : వారానికి 5 రోజుల వర్కింగ్ డేస్.. మరో ఏడాది పొడిగించిన సర్కార్
by Muthe.Rajitha |
ఏపీ ప్రభుత్వం(AP Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఏపీ ప్రభుత్వం(AP Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల 5 రోజుల వర్కింగ్ డేస్(5 Working Days) ఉత్తర్వులను మరో ఏడాది పొడిగించింది. రాజధాని అమరావతి(Amaravati) ప్రాంతంలోని రాష్ట్రస్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల 5 రోజుల పనిదినాలను ఇంకో ఏడాది పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సచివాలయ ఉద్యోగులు, విభాగధిపతులు, వివిధ శాఖల కార్పొరేషన్ ఉద్యోగులు, ఇతర ప్రభుత్వ ఆఫీసుల ఎంప్లాయీస్ కి ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. గతేడాది ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఈనెల 26తో ముగుస్తుండగా.. దీనిని మరో ఏడాదికి పెంచింది. ఈ మేరకు అన్ని శాఖలకు సీఎస్ విజయానంద్(CS Vijayanand) ఉత్తర్వులు జారీ చేసింది.
Next Story






