AP News: మంగళగిరి హైవేపై కారు బీభత్సం.. చెట్టును ఢీ కొట్టి ఫల్టీలు

by Ramesh Goud |

మంగళగిరి(Mangalagiri) హైవేపై ఓ కారు బీభత్సం(Car Accident) సృష్టించింది.

AP News: మంగళగిరి హైవేపై కారు బీభత్సం.. చెట్టును ఢీ కొట్టి ఫల్టీలు
X

దిశ, వెబ్ డెస్క్: మంగళగిరి(Mangalagiri) హైవేపై ఓ కారు బీభత్సం(Car Accident) సృష్టించింది. కారు చెట్టును ఢీ కొట్టడంతో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మంగళగిరి బైపాస్ రోడ్డులోని లక్ష్మీనరసింహస్వామి కాలనీ సమీపంలో భగీరథ హోటల్ వద్ద ఓ కారు అతివేగంగా చెట్టును ఢీ కొట్టి, ఫల్టీలు కొట్టింది. ప్రమాద సమయంలో కారులో నలుగురు వ్యక్తులు ఉన్నారు. నలుగురికి తీవ్ర గాయలు కాగా.. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానికులు ఎన్నారై ఆసుపత్రికి(NRI Hospital) తరలించారు. ప్రమాదానికి కారణం కారు నడిపే వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడని తెలిసింది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయ్యింది. గాయపడిన వారిని రత్నాల చెరువు(Rathnala Cheruvu) వాసులుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి సంబంధించిన దృష్యాలు దగ్గరలోని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

Next Story