- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఔరంగజేబు మంచోడు కాదంటే.. మీకొచ్చిన ప్రాబ్లం ఏంటి?.. ‘హరిహర వీరమల్లు’కు మద్దతుగా ఏపీ ముస్లిం నేత
‘హరిహర వీరమల్లు చిత్రం సాధించిన అఖండ విజయంతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రత్యర్థులకు కడుపు మండుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: ‘హరిహర వీరమల్లు చిత్రం సాధించిన అఖండ విజయంతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రత్యర్థులకు కడుపు మండుతోంది. ఆ మంటతోనే చరిత్ర పేరు చెప్పి కొంతమంది వక్రభాష్యాలు వల్లిస్తున్నార’ని జనసేన పార్టీ(Janasena Party) ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్(Sheikh Riaz) మండిపడ్డారు. కల్పిత పాత్ర అని చెప్పాక కూడా ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఔరంగజేబు(Aurangzeb) ఆకృత్యాలు చూపితే వారికి అంత ఆక్రోశం ఎందుకో అర్థం కావడం లేదన్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్ మొత్తంలో ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఎప్పుడూ సినిమాలు తీయలేదని తెలిపారు. హరిహర వీరమల్లు చిత్రం(Harihara Veeramallu movie) విడుదల అనంతరం ఆ చిత్రాన్ని లక్ష్యంగా చేసుకుని సాగుతున్న దుష్ప్రచారాలపై శనివారం రియాజ్ స్పందించారు. ఈ సందర్భంగా రియాజ్ మాట్లాడుతూ.. "ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రంపై విడుదలకు ముందు నుంచే కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.
వీటన్నింటినీ పటాపంచలు చేస్తూ 23వ తేదీ మిడ్ నైట్ షో నుంచే ప్రేక్షకులు అద్భుత విజయం చేకూర్చారు. చిత్రానికి ఇంతటి విజయాన్ని అందించిన వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. సినిమాకి వస్తున్న స్పందన కొంత మందికి కడుపు మంటతో రగిలిపోతోంది. సినిమాపై వక్రభాష్యాలు ప్రారంభించారు. పవన్ కళ్యాణ్, సినిమా నిర్మాత, దర్శకుడు ముందే చెప్పారు.. ఇది చారిత్రక సత్యాల ఆధారంగా చేసుకొని అల్లుకున్న కల్పిత చిత్రం అని. ఇందులో హరిహర వీరమల్లు అనే వీరుడి పాత్రను సృష్టించారు. నాటి సగటు మనిషి గుండె మంటను చల్లార్చి, అణగారిన వర్గాలకు అండగా నిలిచే వీరుని గాథ ఈ చిత్రం. ఈ విషయాన్ని చిత్రం ప్రారంభంలోనే దర్శకుడు ప్రేక్షకులకు వివరించారు. ఇలాంటి చిత్రం మీద ఉద్దేశపూర్వకంగా నెగిటివ్ టాక్ తీసుకువచ్చే వారికి ప్రేక్షకులు విజయంతో తగిన గుణపాఠం చెబుతున్నారు. ఈ చిత్ర విజయంలో పాల్గొని ధర్మాన్ని కాపాడాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను అని రియాజ్ అన్నారు.






