Breaking: ఎమ్మెల్సీ బొత్సకు అస్వస్థత... ఒక్కసారిగా పెరిగిన బీపీ

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-03-06 11:10:46  IST  )

ఏపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కాగ్ రిపోర్టు పై శాసనమండలి లో మాట్లాడుతుండగా ఆయనకు ఒక్కసారిగా బీపీ పెరిగింది

Breaking: ఎమ్మెల్సీ బొత్సకు అస్వస్థత... ఒక్కసారిగా పెరిగిన బీపీ
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ(Ap Mlc Bosta Satya Narayana) స్వల్ప అస్వస్థత(Illness)కు గురయ్యారు. కాగ్ రిపోర్టు(CAG Report)పై శాసనమండలి(Legislative Council)లో మాట్లాడుతుండగా ఆయనకు ఒక్కసారిగా బీపీ పెరిగింది. ఈ మేరకు ఆయన తూలుతూ ఉగిపోయారు. పక్కనే ఉన్న మరో ఎమ్మెల్సీ పట్టుకోవడంతో బొత్స కిందపడలేదు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అయితే శాసనమండలిలోనే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ-190/120 ఉన్నట్లు గుర్తించారు. బీపీ హెచ్చుతగ్గులతో బొత్స అస్వస్థతకు గురయ్యారని వైద్యులు తెలిపారు. మరోవైపు తన ఆరోగ్యంపట్ల బొత్స స్పందించారు. ఎవరూ ఆందోళన చెందొద్దని, తన ఆరోగ్యం నిలకడగానే ఉందని బొత్స పేర్కొన్నారు.

శాసనమండలిలో ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్న బొత్స

కాగా శాసనమండలి సమావేశాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. మండలి పక్ష నేతగా ప్రభుత్వం ఆయన పోరాటం చేస్తున్నారు. పలు అంశాలపై చర్చకు పట్టుబడుతున్నారు. ప్రభుత్వానాకి దీటైన సమాధానాలు ఇస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలు, పరిణామాలపై శాసనమండలితో పాటు బయట కూడా ప్రెస్ మీట్లు పెట్టి బొత్స ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన శాసనమండలిలో అస్వస్థతకు గురికావడంతో వైసీపీ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. తన ఆరోగ్యం నిలకడగానే ఉందని బొత్స చెప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. బొత్స విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్నారు.

Next Story