- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘నేను ఏంటో చంద్రబాబుకు తెలుసు’: ఏపీ మంత్రి షాకింగ్ కామెంట్స్
ఏపీ మంత్రి టీజీ భరత్ కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మంత్రి టీజీ భరత్(AP Minister TG Bharat) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ‘నా నియోజకవర్గంలో పాలిటిక్స్ చేస్తే నా రాజకీయం ఎలా ఉంటదో చూపిస్తా. రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు నేనే మంత్రిగా ఉంటా. గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్లు ఏం చేశారో.. ఇప్పుడు నేనేం చేస్తున్నానో కూడా ప్రజలు గమనిస్తున్నారు. నేను ఏంటో ముఖ్యమంత్రి చంద్రబాబుకు, మంత్రి నారా లోకేష్‌కు తెలుసు. అనవసరంగా నన్ను లాగొద్దు’ అని మంత్రి టీజీ భరత్ హెచ్చరించారు.
జగన్‌ది అంధ పాలన
మరోవైపు వైసీపీ నేతలు ఇప్పటికీ తప్పిదాలను విశ్లేషించుకోలేక పోతున్నారని.. వచ్చే ఎన్నికల్లో అయినా కనీసం ప్రతిపక్ష హోదా పొందాలన్న ఆలోచన వారికి లేదని ఎద్దేవా చేశారు. జగన్ మాదిరి ఉత్తుత్తి బటన్‌లు నొక్కి రైతులను మోసం చేయమని, తాము బటన్ నొక్కిన అర నిమిషంలోనే రైతుల ఖాతాల్లో సొమ్ము నేరుగా జమ అవుతుందని అన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేని ప్రభుత్వం జగన్‌ది అని విమర్శించారు. రైతుల కష్టాలు కనిపించని అంధ పాలన అది.. అంటూ జగన్ పాలనను తీవ్రంగా ఎండగట్టారు. మా ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాటను చేతల్లో చూపిస్తోంది. రైతుల భవిష్యత్తును నాశనం చేసిన వైసీపీ పాలనను ప్రజలు ఇప్పటికే తిరస్కరించారని, ఇకపై కూడా రైతుల సమస్యలపై రాజకీయాలు చేసే వారికి ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని మంత్రి హెచ్చరించారు.






