- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కర్నూలు ప్రైవేటు బస్సు ప్రమాదంపై ఏపీ మంత్రుల దిగ్భ్రాంతి
కర్నూలు జిల్లా చిన్నటేకూరులో తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాద ఘటనపై ఏపీ మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : కర్నూలు జిల్లా చిన్నటేకూరులో తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాద ఘటనపై ఏపీ మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీనిచ్చారు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందిస్తూ ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంటుకు ఆదేశాలు జారీ చేశారు. బస్సులోనే భౌతిక కాయాలు ఉన్నాయన్నారు. ఘటన స్థలం వద్దే భౌతిక కాయాలకు పోస్టుమార్టం నిర్వహించేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం అన్నారు. ఫోరెన్సిక్ వైద్యులను ఘటన స్థలానికి పంపించామని వెల్లడించారు. భౌతిక కాయాల తరలింపునకు మహాప్రస్థానం వాహనాలు కూడా సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. చనిపోయిన వారిని గుర్తించేందుకు డీఎన్ఏ నమూనాలు కూడా సేకరిస్తున్నాం అని తెలిపారు. స్వల్పగాయాలతో 12 మంది ఆసుపత్రిలో చేరారన్నారు. ప్రాథమిక చికిత్స అనంతరం క్షతగాత్రుల్లో ఆరుగురు డిశ్చార్జి అయ్యారని వెల్లడంచారు.
ఇలాంటి ఘటన జరగడం అత్యంత దురదృష్టకరం
-గొట్టిపాటి రవి కుమార్, విద్యుత్ శాఖ మంత్రి
రాష్ట్రంలో ఇలాంటి ఘటన జరగడం అత్యంత దురదృష్టకరం. ప్రయాణికులు సజీవ దహనం కావడం తీవ్రంగా కలచివేసింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులకు ఆదేశించాం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ప్రకటిస్తున్నాను. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది.






