మురళీ నాయక్‌కు ఏపీ మంత్రుల నివాళి.. కుటుంబానికి భరోసా

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-05-12 12:49:20  IST  )

భారత్ - పాక్ సరిహద్దుల్లో (India-Pakistan War) ఇరు దేశాల సైన్యాల మధ్య జరిగిన కాల్పుల్లో ఏపీకి చెందిన జవాన్ మురళీనాయక్ (Murali Nayak) అమరవీరుడయ్యాడు.

మురళీ నాయక్‌కు ఏపీ మంత్రుల నివాళి.. కుటుంబానికి భరోసా
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్ - పాక్ సరిహద్దుల్లో (India-Pakistan War) ఇరు దేశాల సైన్యాల మధ్య జరిగిన కాల్పుల్లో ఏపీకి చెందిన జవాన్ మురళీనాయక్ (Murali Nayak) అమరవీరుడయ్యాడు. అతని భౌతికకాయం శనివారం రాత్రి భారీ ర్యాలీ నడుమ స్వగ్రామమైన కల్లితండాకు చేరుకుంది. వేలాదిమంది మురళీనాయక్ ఆఖరిచూపు కోసం ఎదురుచూశారు. బెంగళూరు నుంచి కల్లితండాకు (Kalli Tanda) మురళీనాయక్ భౌతిక కాయాన్ని తీసుకెళ్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. "ఎదురేలేని సేవకా.. ఓ సైనికా" అంటూ మురళీనాయక్ కు నివాళులు అర్పిస్తున్నారు.

అమరవీరుడు మురళీనాయక్ కు మంత్రులు నారా లోకేశ్ (Nara Lokesh), అనగాని సత్యప్రసాద్ (Anagani Satya Prasad), అనిత (Home Minister Anitha)నివాళులు అర్పించారు. మురళీనాయక్ తల్లిదండ్రులను ఓదార్చి, కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాగా.. నేడు సైనిక లాంఛనాలతో మురళీనాయక్ కు చెందిన పొలంలో అతని అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ అంత్యక్రియలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు, ఉన్నత అధికారులు హాజరుకానున్నారు.

Next Story