- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP News:ప్రధాని మోడీ మన్ కీ బాత్ 123వ ఎపిసోడ్‌ను వీక్షించిన ఏపీ మంత్రి
ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ(ఆదివారం) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ 123వ ఎపిసోడ్‌ను విజయవాడలో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మంత్రి సత్య కుమార్ యాదవ్ వీక్షించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం విజయవంతం కావడం పై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారని తెలిపారు. యోగా ప్రజల జీవితాల్లో భాగం అవుతుందని చెప్పారు.
ఈ క్రమంలో భారత్ ట్రాకోమా రహిత దేశమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఇది ఆరోగ్య రంగంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, నిరంతరాయంగా పనిచేస్తున్న ఆరోగ్య సిబ్బంది పనితీరుకు నిదర్శనం అన్నారు. భారతదేశంలో 64% జనాభాకు సామాజిక భద్రత అందుబాటులో ఉందని అంతర్జాతీయ కార్మిక సంస్థ ఒక నివేదికను విడుదల చేసిందన్నారు. దేశంలో 95 కోట్ల మంది సామాజిక భద్రతా పథకాల ద్వారా ప్రయోజనం పొందుతున్నారని చెప్పారు.
1975 నాటి ఎమర్జెన్సీ చీకటి రోజులను కూడా గుర్తు చేసిన ప్రధాని మోడీ.. వివిధ పోరాటాలతో ప్రజలు గెలిచారని, ఆ సమయంలో ధైర్యంగా ముందుకు వచ్చి పోరాడిన వారిని మనం గుర్తుంచుకోవాలన్నారు. భారత అంతరిక్ష మిషన్ గురించి కూడా మాట్లాడిన మోడీ వ్యోమగామి శుభాన్షు శుక్లాను అభినందించారని మంత్రి సత్య కుమార్ యాదవ్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.






