- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హరీశ్ రావును పరామర్శించిన ఏపీ మంత్రి సత్యకుమార్
by Thanuru Gopichand |
బిఆర్ఎస్ నాయకుడు, తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు ఇటీవల స్వర్గస్తులయ్యారు.

X
దిశ, వెబ్ డెస్క్ : బిఆర్ఎస్ నాయకుడు, తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు ఇటీవల స్వర్గస్తులయ్యారు. హైదరాబాద్ లోని హరీశ్ రావు నివాసానికి ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ (Satya Kumar Yadav) వెళ్ళారు. స్వర్గస్తులైన సత్యనారాయణ రావు చిత్రపటానికి పూలతో శ్రద్ధాంజలి ఘటించి నివాళి అర్పించారు. హరీశ్ రావును పరామర్శించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. భగవంతుడు వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని ఆశించారు. హరీశ్ రావుతో మాట్లాడుతూ సత్యనారాయణ రావు మరణం వారి కుటుంబానికి తీరని లోటు అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో గుండె నిబ్బరంతో ఉండాలన్నారు.
Next Story






