- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీకానున్న మంత్రి లోకేశ్
ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ కానున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ నేడు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో సమావేశం కానున్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధతను కల్పించే బిల్లుపైరాష్ట్రపతి సంతకం చేయడంతో చట్టరూపం దాల్చింది. ఈ క్రమంలో రాష్ట్రపతికి లోకేష్ ధన్యవాదాలు తెలుపనున్నారు. ఈ సందర్భంగా అమరావతి చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యాన్ని మంత్రి.. రాష్ట్రపతికి వివరించనున్నారు. శాతవాహనుల కాలం నాటి వైభవాన్ని, బౌద్ధ మతానికి కేంద్రంగా ఉన్న అమరావతి విశిష్టతను ఆయన ప్రస్తావించనున్నారు. ఆయన వెంట తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా వెళ్లి రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలువనున్నారు. ఇప్పటికే లోకేష్ ఢిల్లీకి చేరుకోగా.. అక్కడే ఉన్న పార్టీ ఎంపీలు ఆయనకు స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా లోకేష్ మరికొందరు కేంద్ర మంత్రులను కూడా కలిసి రాష్ట్రానికి సంబంధించిన ఐటీ పెట్టుబడులు, విద్యా రంగ ప్రాజెక్టులపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.






