గుల్జార్ హౌస్ ఘటన.. ఏపీ మంత్రి నారా లోకేశ్ ఎమోషనల్ ట్వీట్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-18 08:36:01  IST  )

ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించిన గుల్జార్ హౌస్‌‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 17 మంది మృతి చెందడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు....

గుల్జార్ హౌస్ ఘటన.. ఏపీ మంత్రి నారా లోకేశ్ ఎమోషనల్ ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్(Hyderabad) చార్మినార్ పరిధి గుల్జార్ హౌస్‌(Guljar House)లో అగ్నిప్రమాదం(Fire Accident) జరిగి 17 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై ఏపీ మంత్రి నారా లోకేశ్(Ap Minister Nara Lokesh) స్పందించిన గుల్జార్ హౌస్‌‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 17 మంది మృతి చెందడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. భవనం మొదటి అంతస్తులో చెలరేగిన మంటల్లో చిన్నారులు, మహిళలు సహా పలువురు మరణించడం విషాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు భగవంతుడు ధైర్యం ప్రసాదించాలన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తను ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని లోకేశ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

Next Story