డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్.. ఆ సబ్జెక్టుల ప్రాథమిక ‘కీ’ విడుదల

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-23 04:42:19  IST  )

రాష్ట్రం(Andhra Pradesh)లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ముందుకెళ్తుంది.

డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్.. ఆ సబ్జెక్టుల ప్రాథమిక ‘కీ’ విడుదల
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రం(Andhra Pradesh)లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ముందుకెళ్తుంది. ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ పై మొదటి సంతకం చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో 16,347 ఉద్యోగాల భర్తీకి గానూ ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలను ఈ నెల(జూన్) 6వ తేదీ నుంచి వచ్చే నెల(జులై) 2వ తేదీ వరకు నిర్వహించనుంది. మెగా డీఎస్సీలో మొత్తం 16,347 పోస్టులకు గాను రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3,36,305 మంది దరఖాస్తు చేసుకున్నారు.

అయితే, మెగా డీఎస్సీ(Mega DSC) లో భాగంగా ఈ నెల(జూన్) 14వ తేదీన జరిగిన పీజీటీ వృక్షశాస్త్రం, 17న జరిగిన జంతుశాస్త్రం ఇంగ్లీష్‌ మీడియం పరీక్షల ప్రాథమిక కీ విడుదలైంది. ఈ ప్రిలిమినరీ కీ పై జూన్ 29లోపు అభ్యంతరాలను తెలియజేయాలని కన్వీనర్‌ కృష్ణారెడ్డి తెలిపారు. అభ్యర్థులు ఈ పరీక్షల రెస్పాన్స్‌ షీట్లను ఇవాళ్టి(సోమవారం) నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో https://apdsc.apcfss.in/ తమ వ్యక్తిగత లాగిన్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే గణితం సబ్జెక్టుకు సంబంధించిన ఆన్‌లైన్‌ రాత పరీక్షల ప్రాథమిక ఆన్సర్‌ ‘కీ’ని వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఆన్సర్‌ కీతోపాటు అభ్యర్ధుల రెస్పాన్స్‌షీట్స్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.


Next Story