- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ లిక్కర్ స్కామ్ కేసు.. నిందితులకు మరోసారి రిమాండ్ పొడిగింపు
వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసు (Liquor Scam Case)లో కీలక మలుపు చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసు (Liquor Scam Case)లో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ మేరకు నిందితులకు వచ్చే నెల 9 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు (Vijayawada ACB Court) ఆదేశాలు జారీ చేసింది. అయితే, నేటితో వారి రిమాండ్ ముగుస్తున్న తరుణంలో నిందితులను ఇవాళ సిట్ అధికారులు కోర్టులో హాజరుపర్చారు. కేసులో మరింత విచారణ జరపాల్సి ఉందని అధికారులు కోరడంతో నిందితులకు న్యాయమూర్తి రిమాండ్‌ను పొడిగిస్తున్నట్లుగా వెల్లడించారు. కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డితో పాటు చాణక్య, దిలీప్, సజ్జల శ్రీధర్‌రెడ్డి, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, గోవిందప్ప బాలాజీ విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఇక నవీన్ కృష్ణ, బాలాజీకుమార్ యాదవ్ గుంటూరు జైలులోచ, ఎంపీ మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు.






