ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం... ఏ2 నిందితుడు వాసుదేవరెడ్డి అరెస్ట్

by Vemula.Srinu Prasad |

మద్యం కేసులో ఏపీ బెవరెజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ, ఐఆర్టీఎస్ అధికారి వాసుదేవరెడ్డిని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు...

ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం... ఏ2 నిందితుడు వాసుదేవరెడ్డి అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ బెవరెజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ, ఐఆర్టీఎస్ అధికారి వాసుదేవరెడ్డిని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. జగన్ హయాంలో జరిగిన ఏపీ మద్యం స్కాంకి సంబంధించి విజయవాడ ఏపీఎస్బీసీఎల్ కార్యాలయం నుంచి దస్త్రాలు, కంప్యూటర్ పరికరాలు, ఇతర కీలక పత్రాలను చోరీ చేశారన్న ఫిర్యాదుపై ఆధారాల ధ్వంసం, చోరీ, నేరపూరిత కుట్ర అభియోగాలతో 2024 జూన్ నెలలో ఆయనపై కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సీఐడీ అధికారులు సోదాలకు వెళ్లిన సమయంలో వాసుదేవరెడ్డి పరారయ్యారు. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్నారు. అయితే తాజాగా సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.

Next Story