- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లిక్కర్ కేసు నిందితులకు అస్వస్థత.. హుటాహుటిన జైలు నుంచి తరలింపు
ఏపీ లిక్కర్ కేసు నిందితులు అస్వస్థతకు గురయ్యారు..

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ లిక్కర్ కేసు(Liquor Case) రాష్ట్రంలో పెను సంచలనంగా మారిన విషయం తెలిసిందే. సిట్ విచారణ(SIT Enquiry)లో వైసీపీ(Ycp) నేతల పేర్లు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేసి జైలు(Jailu)కు తరలించారు. అయితే ఈ రోజు జైలులో నిందితులు అస్వస్థతకు గురికావడం కలకలం రేగింది. ఈ కేసులో రిమాండ్ ఖైదీలుగా(Remand prisoner) ఉన్న మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి మంగళవారం ఉదయం ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఇద్దర్నీ విజయవాడ ఆస్పత్రికి తరలించారు. కృష్ణమోహన్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి స్వల్పంగానే అస్వస్థతకు గురయ్యారని, సాధారణ వైద్యం అందించామని తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.
Next Story






