- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ శాసనమండలిలో గందరగోళం.. సోమవారానికి వాయిదా
ఏపీ శాసనమండలిలో గందరగోళం నెలకొనడంతో.. ఛైర్మన్ మోషేను రాజు సభను సోమవారానికి వాయిదా వేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ శాసనమండలిలో గందరగోళం నెలకొనడంతో.. ఛైర్మన్ మోషేను రాజు సభను సోమవారానికి వాయిదా వేశారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసే విషయంపై చర్చించాలని వైసీపీ సభ్యులు పట్టుపట్టారు. ప్రశ్నోత్తరాల సమయంలోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఛైర్మన్ పోడియం వద్ద ప్లకార్డులు ప్రదర్శించగా.. టీడీపీ సభ్యులు వైసీపీకి వ్యతిరేక నినాదాలు చేశారు. వారి ఆరోపణలను తిప్పికొడుతూ ప్లకార్డులు చూపించారు.
గందరగోళంలోనే ప్రశ్నోత్తరాలు పూర్తయినట్లు ప్రకటించిన ఛైర్మన్.. మెడికల్ కాలేజీల ఇష్యూపై స్వల్ప చర్చ చేయాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించినట్లు చెప్పారు. సభకు సహకరించాలని వైసీపీ సభ్యుల్ని కోరారు. జీఎస్టీ సంస్కరణలపై స్టేట్మెంట్ ఇవ్వాలని మంత్రి పయ్యావుల కేశవ్ ను కోరగా.. సభ సజావుగా జరిపించేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీంతో వైసీపీ సభ్యులు మళ్లీ ఆందోళన చేయడంతో మండలిని సోమవారానికి వాయిదా వేశారు.






