- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైసీపీకి బిగ్ షాక్.. బీజేపీలో చేరిన మండలి డిప్యూటీ చైర్ పర్సన్
ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్ పర్సన్ మయానా జకీయా ఖానమ్ బీజేపీలో చేరారు...

దిశ, వెబ్ డెస్క్: ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్ పర్సన్ మయానా జకీయా ఖానమ్(AP Legislative Council Deputy Chairperson Mayana Zakia Khanam) బీజేపీ(Bjp)లో చేరారు. మంగళవారం వైసీపీ(Ycp)కి రాజీనామా చేసిన ఆమె బుధవారం ఉదయం బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి(Purandeswari)ని కలిశారు. అనంతరం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా జకియాకు పురంధేశ్వరి పార్టీ కండువా కప్పి బీజేపీలో ఆహ్వానించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జకీయా ఖానమ్ రాజకీయ కుటుంబానికి చెందిన వారని, బీజేపీలో చేరడం సంతోషంగా ఉందని పురంధేశ్వరి పేర్కొన్నారు.
జకీయా ఖానమ్ మాట్లాడుతూ బీజేపీలో చేరేందుకు తాను ధైర్యంగా నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. మోడీ అందరికీ సమాన హక్కులు అమలు చేస్తున్నారని, ముస్లిం మహిళలకు భరోసా ఇచ్చిన ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని ఆమె వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తండ్రి పాత్ర పోషిస్తున్నారని, ముస్లిం మైనారిటీల నుంచి తాను మంచి మెసేజ్ ఇవ్వడానికి బీజేపీలో చేరానని జకీయా తెలిపారు.






