6 బిల్లులకు ఆమోదం.. ఏపీ శాసనమండలి నిరవధిక వాయిదా

by Naga Rani Yarlagadda |

ఏపీ శాసనమండలిలో (AP Legislative Council) శనివారం జరిగిన సభలో ఆరు బిల్లులకు ఆమోదం తెలిపింది.

6 బిల్లులకు ఆమోదం.. ఏపీ శాసనమండలి నిరవధిక వాయిదా
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ శాసనమండలిలో (AP Legislative Council) శనివారం జరిగిన సభలో ఆరు బిల్లులకు ఆమోదం తెలిపింది. అనంతరం మండలిని నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ మోషేన్ రాజు తెలిపారు. అసెంబ్లీలో ఆమోదం పొందిన.. అంతర్జాతీయ వర్సిటీ ఏర్పాటు బిల్లు -2025, ఏపీ ప్రైవేటు వర్సిటీల చట్టం - 2025, ఏపీ వర్సిటీల సవరణ బిల్లు - 2025, ఏపీ వ్యవసాయ భూమి చట్టం - 2006 బిల్లు, ఏపీ పబ్లిక్ సర్వీసులకు నియామకాల నియంత్రణ, వేతన సరళీకరణ బిల్లు - 2025లకు మండలి ఆమోదం తెలిపింది. అలాగే సుప్రీంకోర్టు ఆదేశానుసారం కుష్టువ్యాధి అనే పదాన్ని తొలగిస్తూ చేసిన చట్ట సవరణపై ఆమోద ముద్ర వేసింది. ఏపీ వస్తు సేవల పన్ను బిల్లు -2025కు మండలిలో ఆమోదం లభించింది. టెన్నిస్ ప్లేయర్ సాకేత్ సాయిని డిప్యూటీ కలెక్టర్ గా నియమిస్తూ చేసిన ప్రతిపాదనకు చేసిన చట్ట సవరణకు సభ ఆమోదం తెలిపింది. అనంతరం మండలిని ఛైర్మన్ నిరవధిక వాయిదా వేశారు.

Next Story