కల్తీ నెయ్యి అంశంపై చర్చకు వైసీపీ పట్టు.. మండలి వాయిదా

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-02-17 09:40:11  IST  )

ఏపీ శాసనమండలి ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడింది. కల్తీ నెయ్యి అంశంపై చర్చించాలని వైసీపీ సభ్యులు ఆందోళన చేశారు.

కల్తీ నెయ్యి అంశంపై చర్చకు వైసీపీ పట్టు.. మండలి వాయిదా
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ శాసనమండలి సమావేశాలు రెండ్రోజుల విరామం తర్వాత నేటి ఉదయం 11 గంటల పునఃప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే.. వైసీపీ నేతలు తిరుమల కల్తీ నెయ్యి అంశంపై చర్చించాలని పట్టుబట్టారు. దీంతో సభలో గందగోళం నెలకొంది. కల్తీ నెయ్యిపై చర్చించాల్సిందేనంటూ నినాదాలు చేస్తూ వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. హెరిటేజ్, ఇందాపూర్ డెయిరీల నెయ్యి సరఫరాపై వైసీపీ వాయిదా తీర్మానం ఇవ్వగా.. ఛైర్మన్ దానిని తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులంతా ప్లకార్డులతో ఆయన పోడియంను చుట్టుముట్టారు. ఆందోళన నేపథ్యంలో ఛైర్మన్ శాసనమండలిని వాయిదా వేశారు.

విధులు సక్రమంగా నిర్వర్తించని ఎమ్మెల్యేలను రీకాల్ చేయాలి : స్పీకర్ సంచలనం

Next Story