ఏపీ లాసెట్ ఫలితాలు విడుదల.. 80 శాతం మంది ఉత్తీర్ణత

by Vemula.Srinu Prasad |

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల నిర్వహించిన లాసెట్ పరీక్షల ఫలితాలు సోమవారం అధికారికంగా విడుదలయ్యాయి..

ఏపీ లాసెట్ ఫలితాలు విడుదల.. 80 శాతం మంది ఉత్తీర్ణత
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో ఇటీవల నిర్వహించిన లాసెట్ (LAWCET) పరీక్షల ఫలితాలు(Results) సోమవారం అధికారికంగా విడుదలయ్యాయి. మంత్రి నారా లోకేశ్(Minsiter Nara Lokesh) ఈ ఫలితాలను ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా రిలీజ్ చేశారు. పరీక్ష రాసిన అభ్యర్థులు తమ ఫలితాలను చూసుకోవచ్చని చెప్పారు. ఈ ఏడాది లాసెట్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 23,996 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అందులో 19,197 మంది విద్యార్థులు అర్హత సాధించారు. దీని ప్రకారం ఈ సంవత్సరం లాసెట్ పరీక్షల్లో మొత్తం 80 శాతం మంది అభ్యర్థులు క్వాలిఫై అయినట్లు స్పష్టమవుతోంది.

వెబ్‌సైట్ నుంచి ర్యాంకు కార్డులు

పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులందరూ తమ ర్యాంకు కార్డులను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. విద్యార్థులు తమ వివరాలను నమోదు చేసి ర్యాంకు కార్డులను సులభంగా పొందవచ్చని, ప్రవేశాల ప్రక్రియకు ఇవి కీలకమని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.

Next Story