పెన్షన్ల పంపిణీలో ధనిక రాష్ట్రాలకంటే ఏపీనే గ్రేట్ : సీఎం చంద్రబాబు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-05-31 09:17:48  IST  )

పెన్షన్లు పెంచుతామని చెప్పి.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అన్నారు. శనివారం అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సీఎం పింఛన్లు పంపిణీ చేశారు.

పెన్షన్ల పంపిణీలో ధనిక రాష్ట్రాలకంటే ఏపీనే గ్రేట్ : సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: పెన్షన్లు పెంచుతామని చెప్పి.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అన్నారు. శనివారం అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సీఎం పింఛన్లు పంపిణీ చేశారు. కాట్రేనికోన మండలం చెయ్యేరులో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందించారు. అనంతరం చెయ్యేరులో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఎన్‌.డి.ఎ నుంచి 17 మంది మహిళా క్యాడెట్లు ఉత్తీర్ణులవడం గర్వకారణంగా ఉందన్నారు. ఇదొక చారిత్రక క్షణమని పేర్కొన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే పెన్షన్ల కోసం రూ.34 వేల కోట్లను ఖర్చు చేశామన్నారు. పేదలకు ఎప్పటికప్పుడు పెన్షన్లను పెంచిన ఘనత టీడీపీ(TDP)కే దక్కుతుందన్నారు. పెన్షన్ల విషయంలో ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉందో సీఎం వివరించారు. 3 నెలలకు ఒకసారి ఇచ్చే పింఛన్లలో అదనంగా 9,176 మందికి ఇచ్చామని తెలిపారు. దేశంలో ఉన్న మరే రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో పెన్షన్లు ఇవ్వడం లేదని సీఎం మరోసారి చెప్పారు. పేద ప్రజలకు ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు చేపడుతున్నామన్న ఆయన.. ప్రతినెలా 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులతో పాటే 64 లక్షల మంది పెన్షన్ దారులకు పెన్షన్ అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 90 శాతం పెన్షన్లు పంపిణీ చేయడం పూర్తయిందని తెలిపారు. కొందరికి వారు పనిచేసే చోటే పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు.

గత ప్రభుత్వం వితంతు పింఛన్ ఇవ్వలేదని దుయ్యబట్టారు. కూటమి సర్కార్ హయాంలో 71,380 మందికి వితంతు పింఛన్లు ఇచ్చినట్లు వెల్లడించారు. ధనిక రాష్ట్రాల కంటే ఏపీలోనే ఎక్కువ పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే ఎక్కువ పెన్షన్ ఇస్తున్నామని వివరించారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, దివ్యాంగులు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే ఈ స్థాయిలో పెన్షన్లు ఇస్తున్నామన్నారు. అలాగే డయాబెటీస్ తో కాలు కోల్పోయిన పోలిశెట్టి దుర్గాప్రసాద్ అనే వ్యక్తి కుమార్తెకు రూ.1,50,000తో సర్టిఫికెట్లు తీసుకుని ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదని సీఎం హామీ ఇచ్చారు. అతనికి కూడా ఈ నెల నుంచే పెన్షన్ మంజూరు చేస్తున్నానని తెలిపారు. మెగా డీఎస్సీ (Mega DSC)పై సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. 16,347 పోస్టులతో త్వరలోనే అందరికీ ఉద్యోగాలు వస్తాయని స్పష్టం చేశారు. ఫైల్ పై మొదటి సంతకం చేశానని, దానిని అమలు చేసేందుకు ముందుకు వెళ్తున్నామని చెప్పారు.

Next Story