- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NagarjunaSagar : నాగార్జునసాగర్ డ్యాం వివాదంపై ఏపీ ఇరిగేషన్ వివరణ
by Muthe.Rajitha |
నాగార్జునసాగర్(NagarjunaSagar) డ్యాం వివాదంపై ఏపీ ఇరిగేషన్ శాఖ వివరణ ఇచ్చింది.

X
దిశ, వెబ్ డెస్క్: నాగార్జునసాగర్(NgarjunaSager) డ్యాం వివాదంపై ఏపీ ఇరిగేషన్ శాఖ వివరణ ఇచ్చింది. సాగర్ డ్యాం విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య ఎలాంటి వివాదం లేదని ప్రకటించారు. తెలంగాణ(Telangana), ఏపీ(AP) అధికారుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, మీడియాలో అసత్య ప్రచారాలు నమ్మకండి అని అన్నారు. రెండు రాష్ట్రాల అధికారులు పరస్పర సహకారంతో ప్రాజెక్ట్ గేట్ల నిర్వహణను పరిశీలిస్తున్నారని వెల్లడించారు. సాగర్ కుడి కాలువ రీడింగ్ విషయంలో చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వలన ఇద్దరు ఉద్యోగుల మధ్య మనస్పర్థలు తలెత్తాయి అన్నారు. ఇద్దరు ఉద్యోగులతో మాట్లాడి సమస్యను పరిష్కరించామని ఏపీ నీటిపారుదలశాఖ ఎస్సీ కృష్ణమోహన్ మీడియాకు తెలియజేశారు.
- Tags
- Nagarjunasagar
Next Story






