- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP: రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం.. ‘నిమిషం’ ఆలస్యమైనా నో ఎంట్రీ
ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ‘నిమిషం’ ఆలస్యమైనా అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ (Intermediate) వార్షిక పరీక్షలు నేటి నుంచి అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ప్రారంభమయ్యాయి. మార్చి 24 వరకు జరగనున్న ఈ పరీక్షల కోసం ఇంటర్మీడియట్ బోర్డు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. టైట్ టేబుల్ ప్రకారం పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సమయపాలన పాటించాలని అధికారులు సూచించారు. ‘ఒక్క నిమిషం’ (One Minute) ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని ఇప్పటికే స్పష్టం చేశారు. విద్యార్థులు కనీసం అరగంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని పేర్కొన్నారు.
కాగా, ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,57,899 మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారు. అందులో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 5,31,275 మంది విద్యార్థులు, సెకండియర్ విద్యార్థులు 5,26,264 మంది ఉన్నారు. స్టేట్‌లో మొత్తం 1,537 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల్లో అక్రమాలు జరగకుండా నిఘా ఉంచేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్లను, సిట్టింగ్ స్క్వాడ్లను రంగంలోకి దించారు. అన్ని కేంద్రాల వద్ద బీఎన్ఎస్ యాక్ట్‌లోని సెక్షన్ 163 అమలు చేయనున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా విద్యార్థుల కోసం పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రాథమిక వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచారు.






