- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంటర్ సిలబస్‌లో కీలక మార్పులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థ పై ప్రత్యేక దృష్టి సాధించింది.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థ (Education system) పై ప్రత్యేక దృష్టి సాధించింది. ఇందులో భాగంగా మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) అధికారులతో సమీక్షించిన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాఠశాలలకు రాజకీయాలను పూర్తిగా దూరంగా ఉంచాలని ఆదేశించడంతో పాటు విద్యార్థులకు మెరుగైన విద్య, భోజనం, టిఫిన్, యూనిఫామ్, స్కూల్ బ్యాగులు అందించిన విషయం తెలిసిందే. అయితే మంత్రి ఆదేశాలతో ఇంటర్ సిలబస్ (Inter Syllabus)లో బోర్డు కీలక మార్పులు చేసింది.
ఇకపై ఇంటర్ మొదటి సంవత్సరంలో ల్యాబ్స్, ప్రాక్టికల్ ఎగ్జామ్స్, 20 ఇంటర్నల్ పరీక్షల మార్కులు, 80 ఎక్స్ టర్నల్ మార్కులతో పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే 12 ఏళ్ల తర్వాత సైన్స్ కోర్సు సిలబస్‌లోను ఇంటర్ బోర్డు (Inter Board) మార్పు చేసినట్లు తెలుస్తుంది. ఇంటర్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సిలబస్‌లో మార్పులు చేశారు. హ్యుమానిటీస్ సబ్జెక్టుల్లో యాక్టివిటీ బేస్డ్ సిలబస్‌ను ఇంటర్ బోర్డు తెస్తుంది. అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్‌లతో ఏసీఈ కోర్సు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఇప్పటికే అధికారులకు, ఆదేశాలు జారీ అయ్యాయి.






