- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళతో ఏపీ IAS ఇల్లీగల్ ఎఫైర్.. దర్జాగా ప్రాణాలు తీసి తిరిగి విధులకు!
ఐఏఎస్ (IAS) అధికారి అంటే.. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధి లాంటి వారు.

దిశ, వెబ్‌డెస్క్: ఐఏఎస్ (IAS) అధికారి అంటే.. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధి లాంటి వారు. సంయమనంతో ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరిస్తూ సమాజ అభివృద్ధిలో వారిది కీలక పాత్ర. కానీ, ఇప్పుడు ఆ ఐఏఎస్‌లు తప్పటడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి కొమ్ముకాస్తూ చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు. పొలిటికల్ లీడర్లు చేసే కుంభకోణాల్లోనూ భాగస్వాములు అవుతూ.. కొందరు విచారణలు ఎదుర్కొంటూ ఉంటే, మరికొందరు ఏకంగా జైలు పాలవుతున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా, ఓ ఐఏఎస్ చేసిన దురాగతం సభ్యసమాజం తలదించుకునే ఉంది. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ సీనియర్ ఐఏఎస్, సీఎం పేషీలోనూ పనిచేసిన ఆయన గత కొన్నేళ్లుగా హైదరాబాద్ (Hyderbad)కు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే తన కుటుంబాన్ని సైతం నిర్లక్ష్యం చేసి ఆమెతోనే చాలా సమయం గడిపేవాడట. కట్ చేస్తే.. ఇటీవలే ఆ ఐఏఎస్ ఓ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. అదృష్ట కొద్దీ చావు నుంచి తప్పుకున్నాడు. ఇక్కడే అసలు కథ మొదలైంది. తాను ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న టైమ్‌లో సదరు మహిళ వేరే వ్యక్తులతో సన్నిహితంగా ఉంటుందని ఆ ఐఏఎస్ అనుమానం పెంచుకున్నాడు.
వారం రోజుల క్రితం అదే విషయంపై నిలదీస్తూ.. సహనం కోల్పోయి విచక్షణారహితంగా ఆమెపై దాడి చేసి తలను గోడకేసి కొట్టడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిందట. అయితే, తనకు ఉన్న పలుకుబడితో సదరు ఐఏఎస్ తాను ఎఫైర్ పెట్టుకున్న మహిళ మెట్ల మీద నుంచి కింద పడిపోయిందని ఆసుపత్రి రికార్డుల్లో పోలీసులు కేసు బుక్ చేయకుండా రాయించాడని తెలుస్తోంది. పైగా తనకు ఏం తెలియనట్లుగా తెలియనట్లుగా ఆ ఐఏఎస్ అధికారి దర్జాగా విజయవాడ తిరిగి వెళ్లి తిరిగి విధుల్లో చేరాడని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ విషయం కాస్త తోటి ఐఏఎస్‌కు తెలియడంతో వారు సైతం నిర్ఘాంతపోతున్నారని సమాచారం.






