- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Vijayawada:కనకదుర్గమ్మను దర్శించుకున్న ఏపీ హోంమంత్రి
విజయవాడ(Vijayawada) ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను ఈ రోజు(గురువారం) ఉదయం ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు.

దిశ,వెబ్‌డెస్క్: విజయవాడ(Vijayawada) ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను ఈ రోజు(గురువారం) ఉదయం ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఈ క్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగన్మాత ఆశీస్సులు ప్రతి ఒక్కరి పై ఉండాలని ఆమె కోరుకున్నారు. అమ్మవారికి కుటుంబ సభ్యులతో కలిసి పట్టుచీర సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం హోంమంత్రి అనితకు వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ నూతన ఈవో శీనా నాయక్ అమ్మవారి శేష వస్త్రం, ప్రసాదం చిత్రపటం అందజేశారు.
అనంతరం హోంమంత్రి అనిత(Home Minister Anitha).. ఆలయం క్యూలైన్లలో భక్తులను ఆత్మీయంగా పలకరించి అమ్మవారి సన్నిధిలో వసతి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం హోంమంత్రి అనిత వెలగపూడి సచివాలయానికి వెళ్లారు. అక్కడ ప్రజలను కలిసి వారి గ్రీవెన్స్ స్వీకరించారు.
ఆ తర్వాత 2వ బ్లాక్ లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న హెంశాఖ(Home Department) కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా పరిశీలించారు. ఫైళ్లు, రికార్డులను గురించి అడిగి తెలుసుకున్నారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ తో కలిసి అన్ని ఛాంబర్‌లోని సిబ్బందిని పలకరిస్తూ వారితో మాట్లాడారు. హోంశాఖకు వచ్చే గ్రీవెన్స్ త్వరితగతిన పూర్తి చేయాలని హోం మంత్రి అనిత ఆదేశాలు ఇచ్చారు.






