AP News:మానవత్వం చాటుకున్న ఏపీ హోంమంత్రి అనిత

by Jakkula.Mamatha |

ఏపీ హోంమంత్రి(AP Home Minister) వంగలపూడి అనిత(Vangalapudi Anitha) ఆపదలో ఉన్న వారిని చూసి హోదా పక్కన పెట్టి మరీ మానవత్వం చూపించారు.

AP News:మానవత్వం చాటుకున్న ఏపీ హోంమంత్రి అనిత
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ హోంమంత్రి(AP Home Minister) వంగలపూడి అనిత(Vangalapudi Anitha) ఆపదలో ఉన్న వారిని చూసి హోదా పక్కన పెట్టి మరీ మానవత్వం చూపించారు. విశాఖ గాజువాక జంక్షన్‌లో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. బైకును ఢీకొట్టింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న హోంమంత్రి అనిత ప్రమాదాన్ని చూసి.. వెంటనే కాన్వాయ్ ఆపి అక్కడికి వెళ్లారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంలో గాయపడిన చిన్నారి దగ్గరకు వెళ్లి పరామర్శించారు. వెంటనే బాధితులకు తక్షణ సాయం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. వారిని ఆస్పత్రికి తరలించే వరకు అక్కడే ఉన్నారు. హోదాను పక్కనపెట్టి మానవత్వంతో అనితమ్మ స్పందించిన తీరుపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story