BREAKING: అంబటి ఇంటిపై దాడి ఘటనపై హైకోర్టు సీరియస్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-02-01 13:14:33  IST  )

అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేసిన ఘటనపై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

BREAKING: అంబటి ఇంటిపై దాడి ఘటనపై హైకోర్టు సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేసిన ఘటనపై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంబటి రాంబాబు కుటుంబానికి 24 గంటల భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తమ ఇంటిపై దాడి చేయడంపై అంబటి రాంబాబు భార్య విజయలక్ష్మి హైకోర్టులో వేసిన హౌస్ మోషన్ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోకి వచ్చేవరకూ ఆయన ఫ్యామిలీకి భద్రత ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొంది.

Next Story