AP High Court: హైకోర్టులో పోసానికి బిగ్ రిలీఫ్.. ధర్మాసనం కీలక ఆదేశాలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-03-10 08:07:22  IST  )

వైసీపీ నేత, ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి (Posani Krishna Murali) ఈ నెల 5న ఏపీ హైకోర్టు (AP High Court)ను ఆశ్రయించారు.

AP High Court: హైకోర్టులో పోసానికి బిగ్ రిలీఫ్.. ధర్మాసనం కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ నేత, ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి (Posani Krishna Murali) ఈ నెల 5న ఏపీ హైకోర్టు (AP High Court)ను ఆశ్రయించారు. ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu), మంత్రి నారా లోకేష్‌ (Nara Lokesh), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pavan Kalyan) కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ (Quash Petition) దాఖలు చేశారు. అదేవిధంగా పాతపట్నం, సూర్యారావుపేట, కర్నూలు, అదోని టూటౌన్ పోలీసులు తనపై నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని ఆ క్వాష్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. విశాఖ (Vishakha) వన్‌టౌన్‌ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుపై స్టే విధిస్తూ తీర్పును వెలువరించింది. అదేవిధంగా పాలకొండ (Palakonda), పాడేరు (Paderu), విశాఖ (Vishakha), పట్టాభిపురం (Pattabhipuram) పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులలో 35 (3) ప్రకారం నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కేసులో తదుపరి విచారణను కోర్టు వచ్చే బుధవారానికి వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించింది.

Next Story