పరకామణి చోరీ కేసు.. సీఐడీ, ఏసీబీలకు హైకోర్టు కీలక సూచన

by Naga Rani Yarlagadda |

కలియుగ ఇలవైకుంఠం తిరుమల తిరుపతి దేవస్థానంలో పరకామణి చోరీకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

పరకామణి చోరీ కేసు.. సీఐడీ, ఏసీబీలకు హైకోర్టు కీలక సూచన
X

దిశ, వెబ్‌డెస్క్: కలియుగ ఇలవైకుంఠం తిరుమల తిరుపతి దేవస్థానంలో పరకామణి చోరీకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సోమవారం ఏపీ హైకోర్టులో ఈ కేసు విచారణకు రాగా.. టీటీడీ అధికారులు న్యాయస్థానానికి కీలక నివేదికను సమర్పించారు. పరకామణి భద్రతకు సంబంధించి ఏఐ టెక్నాలజీని అమలు చేయడం సాధ్యమా? దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? సాంకేతిక పరీక్షలు, సమాచార విశ్లేషణ పైలట్ మోడల్స్ వంటి వివరాలతో సమగ్ర రిపోర్టును హైకోర్టుకు అందించారు. దీనిని పరిశీలించిన కోర్టు.. పరకామణి భద్రతకు ఏఐను అమలు చేయడంపై మరింత పర్యవేక్షణ అవసరమని పేర్కొంటూ విచారణను రేపటికి వాయిదా వేసింది.

సీఐడీ, ఏసీబీ అధికారులకు సూచన

కాగా.. పరకామణి చోరీకి సంబంధించి మరో ఎఫ్ఐఆర్ నమోదు చేసే అంశంపై సుప్రీంకోర్టు తీర్పును పరిశీలించాలని సీఐడీ, ఏసీబీ అధికారులకు హైకోర్టు సూచించింది. దీంతో పరకామణి చోరీ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగుచూసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

Next Story