- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP | ఆ పదం వింటే నరనరాన దేశభక్తి ఉప్పొంగుతుంది
స్వాతంత్య్రోద్యమంలో వందేమాతర నినాదం బ్రిటీషర్లకు వణుకు పుట్టించింది.

దిశ, వెబ్ డెస్క్ : స్వాతంత్య్రోద్యమంలో వందేమాతర నినాదం బ్రిటీషర్లకు వణుకు పుట్టించింది. భారతీయులందరినీ ఏకతాటిపైకి తెచ్చి స్వతంత్ర కాంక్షను బలోపేతం చేసింది. భరత భూమిని కీర్తిస్తూ సాగిన వందేమాతర నినాదం బంకిమ్ చంద్ర ఛటర్జీ (Bankim Chandra Chatterjee) రచించిన వందేమాతర గీతం నుంచి గ్రహించబడింది. 1987, నవంబరు 7న రచించిన ఆ గీతం నేటికి 150 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. తొలిసారి ఆనంద్ మఠ్ (Anand Math) నవలలో ప్రచురితమైంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఏడాది పాటు కార్యక్రమాలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
దేశభక్తి ఉప్పొంగుతుంది : డిప్యూటీ సీఎం
దేశ స్వాతంత్య్రం కోసం వందేమాతర (Vandemataram) నినాదమిస్తే బ్రిటీషర్లు భారతీయులను జైళ్లపాలు చేశారు. అయినా కూడా స్వాతంత్య్ర కాంక్షతో ఉన్న భారతీయులు నినాదాన్ని వదలలేదు. కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు మరింత భీకరమైన రణ నినాదంలా దాన్ని వినిపించారు. ఈ రోజుకీ వందేమాతరం ఆలపించినా, ఆ పదాన్ని విన్నా నరనరాన దేశభక్తి ఉప్పొంగుతుంది. ఒళ్లు పులకరిస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. వందేమాతరం స్ఫూర్తిని భావి తరాలకు అందించే బాధ్యత మనందరిపైన ఉందన్నారు. దేశవ్యాప్తంగా నిర్దేశిత సమయంలో ప్రజలందరూ వందేమాతరం ఆలపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. నేడు ఉదయం 10 గంటలకు ప్రతి ఒక్కరం వందేమాతర గేయాన్ని ఆలపిద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. వందేమాతరం స్ఫూర్తిని భావి తరాలకు అందించే బాధ్యత మనందరిదీ.






