- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైద్యారోగ్యశాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్‌పై బదిలీ వేటు.. ముందే చెప్పిన ‘దిశ’
వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ పై బదిలీ వేటు పడింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.

దిశ, ఏపీ బ్యూరో : వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ పై బదిలీ వేటు పడింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి పోస్టింగ్ కోసం సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ కు వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
అలాగే, సౌరభ్ గౌర్ నిర్వహిస్తున్న ఏపీఎంఎస్‌ఐడీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ , డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ బాధ్యతలను కూడా ఎస్. సురేష్ కుమార్‌కు అదనపు బాధ్యతలుగా ప్రభుత్వం అప్పగించింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది. సౌరభ్ గౌర్ ను వైద్యశాఖ నుంచి బదిలీ చేస్తారనే అంశాన్ని ‘దిశ’ దిన పత్రిక ముందే వెలుగులోకి తెచ్చింది. ఈమేరకు ‘వైద్యశాఖ కార్యదర్శి మార్పు’ శీర్షికన గతనెల్లోనే వార్త ప్రచురితమైన విషయం విధితమే.
సీఎంఓకు ఫిర్యాదుల వెల్లువ
సౌరభ్ గౌర్ అక్రమాలకు పాల్పడుతున్నారంటూ నేరుగా సీఎంఓకు ఫిర్యాదులు అందినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ బాధ్యతల నిర్వహిస్తున్న ఆయన, 30 మంది ఉద్యోగులకు సంబంధించి ఫైల్ తయారు చేయాల్సిందిగా సంబంధిత అధికారికి ఆదేశాలు ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. బదిలీపై నిషేధం ఉన్న సమయంలో ఒకేసారి 30 మంది ఉద్యోగుల బదిలీలు ఏ విధంగా చేస్తారనే దానిపై సీఎంఓకు ఫిర్యాదు వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే, పిడుగురాళ్ల మెడికల్ కళాశాల పనులు నత్తనడకన సాగుతుండటంపై క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించిన డీఎంఈ విష్ణువర్ధన్ నివేదికను మంత్రి పేషీకి ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై సీఎంఓ అధికారులు సౌర భ్‌గౌర్‌ను ప్రశ్నించినట్లు భోగట్టా.
ఉద్యోగుల గగ్గోలు
ఏడు నెలల నెలల క్రితమే వైద్యశాఖ కార్యదర్శిగా సౌరభ్ గౌర్ బాధ్యతలు చేపట్టారు. సమీక్షల సందర్భంలో విభాగాధిపతులపై ఓ రేంజ్‌లో విరుచుకుపడేవారనే ఆరోపణలు ఉన్నాయి. సౌరభ్ తమను ఏ మాత్రం గౌరవంగా చూడటం లేదని అధికారులు గగ్గోలు పెట్టారు. అసలు హెల్త్ డిపార్ట్ మెంటే బాగోలేదంటూ సౌరభ్‌గౌర్ తరుచు చిర్రుబుర్రులాడుతుండటంతో ఇప్పటికే కొందరు అధికారులు సెలవుపై వెళ్లిపోయారు. గతంలో పనిచేసిన డీఎంఈ రఘునందన్ ఆ బాధ్యతల నుంచి వైదొలగడానికి ప్రధానంగా సౌరభ్ గౌర్ వేధింపులే కారణమన్న విమర్శలు ఉన్నాయి. అత్యంత కీలకమైన వైద్య ఆరోగ్యశాఖలో మున్నెన్నడూ లేని విధంగా పాలనా పరమైన ఇబ్బందులు తలెత్తాయి. వీటన్నింటిపై విజిలెన్స్ విచారణ నిర్వహించిన అనంతరం సౌరభ్‌గౌర్‌ను వైద్యశాఖను తప్పించాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోంది.






