ఆశా వర్కర్లకు గుడ్ న్యూస్‌..వారంద‌రికీ కొత్త ఫోన్లు, 2 చీరలు !

by velandi.Saikiran |

ఏపీలోని ఆశా వర్కర్లకు కొత్త ఫోన్లు, రెండు కొత్త చీరలు ఇచ్చేందుకు నిర్ణయం స‌ర్కార్‌ తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

ఆశా వర్కర్లకు గుడ్ న్యూస్‌..వారంద‌రికీ కొత్త ఫోన్లు, 2 చీరలు !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆశా వర్కర్లకు కూటమి సర్కార్ శుభవార్త అందించింది. ఏపీలోని ఆశా వర్కర్లకు కొత్త ఫోన్లు, రెండు కొత్త చీరలు ఇచ్చేందుకు నిర్ణయం స‌ర్కార్‌ తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా ఏపీ కూటమి మంత్రి సత్య కుమార్ హామీ ఇచ్చారు. ఎన్ హెచ్ ఎం ప్రకారం ఇతర ఉద్యోగుల మాదిరి లాగానే ఇకపై సెలవులు ఇస్తామని ప్ర‌క‌ట‌న చేశారు. దహన సంస్కారాలకు 15 వేల రూపాయల చొప్పున ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు మంత్రి సత్య కుమార్. 1363 ఖాళీలను భర్తీ చేస్తామని కూడా ప్రకటించారు. బీమా సౌకర్యం వర్తింపు విషయంపై పరిశీలన చేస్తున్నామని వివరించారు.

ఆశా వర్కర్లు యూనియన్ ప్రతినిధులతో మంత్రి సత్య కుమార్ తాజాగా సమావేశం అయిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. కూటమి సర్కార్ అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు వెళుతుందని వివరించారు. ప్రతి ఉద్యోగికి న్యాయం చేస్తామన్నారు. ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని స్పష్టం చేశారు. జగన్ మోహన్ రెడ్డి సర్కార్ హయాంలో ఏపీలో మొత్తం 17 మెడికల్ కాలేజీలు నిర్మించేసారంటూ వైసీపీ పార్టీ నాయకులు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు మంత్రి సత్య కుమార్. తాము రాబోయే రెండు సంవత్సరాలలో పీపీపీ పద్ధతిలో 10 వైద్య కళాశాలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రకటన చేశారు.

Next Story