- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు ఏపీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం (ఫిబ్రవరి 23న) యథావిధిగా గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం (ఫిబ్రవరి 23న) యథావిధిగా గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు (AP Group-2 Mains Exams) జరగనున్నాయి. రోస్టర్ తప్పులను సరిచేసే వరకు గ్రూప్-2 పరీక్ష వాయిదా వెయ్యాలని శుక్ర, శని వారాల్లో అభ్యర్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేయాలని కూటమి ప్రభుత్వం ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు లేఖ రాసినప్పటికీ.. పరీక్ష రాసే అభ్యర్థులు డిగ్రీ పూర్తిచేసిన వారని, వాయిదా వేస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘన అవుతుందని, ఆదివారం యథావిథిగా పరీక్ష నిర్వహించేందుకే APPSC మొగ్గుచూపింది. ఈ మేరకు పరీక్షల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
కాగా, ఏపీ గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్షలో మొత్తం 92,250 మంది మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు. వీరందరికీ రాష్ట్రవ్యాప్తంగా 175 పరీక్ష కేంద్రాల్లో ఆదివారం పరీక్ష జరగనుంది. మొదటి సెషన్‌లో ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష, రెండో సెషన్‌లో మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్షలు జరుగుతాయి. అభ్యర్థులు 15 నిమిషాలు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని APPSC పేర్కొంది. ఇక పరీక్ష కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అలాగే, గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేసినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది.






